సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం సైబర్ దివాస్, మాదకద్రవ్యాల నివారణ, ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఎస్సై సందీప్ సైబర్ నేరాల రక్షణ, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, హెల్మెట్ వాడకం, మైనర్లు వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు సైబర్ భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్