నిజామాబాద్ నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో బాలాజీ అనే యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పానీపూరి బండి నిర్వహిస్తున్నాడు. కేంద్రమంత్రి అమిత్ షా పర్యటనలో బండిని పోలీసులు తీసేశారు. తర్వాత పానీపూరి బండి నడిపించుకుంటానని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అడుగగా, ట్రాఫిక్ పోలీసులు అనుమతించలేదు. వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు అతనిని అడ్డుకున్నారు.