ఎస్సెస్సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈవో టి. అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు తమ హాల్టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని, ప్రధానోపాధ్యాయుల సంతకం తీసుకుని పరీక్షకు హాజరుకావాలని సూచించారు.