నిజామాబాద్‌లోని విజ్ఞాన్ స్కూల్‌లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) సోమవారం డిమాండ్ చేసింది. జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన వస్తువులకు డబ్బులు వసూలు చేస్తున్నారని, నోట్‌బుక్స్‌ను అధిక ధరలకు విక్రయించి రసీదులు ఇవ్వడం లేదని TGVP టౌన్ ప్రెసిడెంట్ సుంకోజి అఖిల్ ఆరోపించారు. ఈ అక్రమాలపై విచారణ జరిపి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు.