న్యాయవాది హత్య చేసిన దుండగుల అరెస్టు చేయాలి

హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ పై జరిగిన కిరాతక దాడిని, ఆయన మరణాన్ని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. దుండగులు పథకం ప్రకారం కారుతో ఢీకొట్టి పారిపోయారని, చికిత్స పొందుతూ ఆయన మరణించారని తెలియడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని, ఈ హత్య హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర, నిష్పక్షపాత, వేగవంతమైన దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హత్య న్యాయవాదుల సమాజంలో భయం, ఆందోళన సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్