నిజామాబాద్ ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన అధ్యక్షునిగా ఘన విజయం సాధించిన ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా తమ ప్యానల్ సభ్యులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణని నగరంలోని సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించి, సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి సంఘ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.