నగరంలో మంగళవారం అర్ధరాత్రి తాళం వేసిన ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. 4వ టౌన్ పరిధిలోని పద్మానగర్ రోడ్ నంబర్ 2, 3లో మొదట ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగ 3 గ్రాముల బంగారు గొలుసు, రూ. 10వేల నగదు దోచుకున్నారు. అనంతరం పక్క వీధిలో మరో ఇంట్లోకి చొరబడి రెండున్నర తులాల బంగారు గొలుసును, మరో ఇంట్లో ఇద్దరు వృద్ధులను భయపెట్టి రూ. 3500 నగదును దోచుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.