మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

నిజామాబాద్​ ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​లో పనిచేస్తున్న కానిస్టేబుల్​ నరేష్​ మానవత్వం చాటుకున్నాడు. నగరంలోని వెల్​నెస్​ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న 19 రోజుల చిన్నారికి ఏబీ పాజిటివ్​ రక్తం అత్యవసరమైంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్​ నరేష్​కు​ ఈ విషయం తెలియగానే వెంటనే స్పందించి, ఆస్పత్రికి వచ్చి రక్తదానం చేశాడు. దీంతో అత్యవసర స్థితిలో ఉన్న చిన్నారి ప్రాణాలు నిలిచాయి. శిశువు తల్లిదండ్రులు కానిస్టేబుల్​ నరేష్​కు​ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్