వీబీజీ రాంజీ పథకంపై అధికారులకు శిక్షణ

ధర్పల్లి మండలంలోని రైతు వేదికలో గురువారం ధర్పల్లి, సిరికొండ మండలాలకు చెందిన అధికారులు, సర్పంచులకు వీబీజీ రాంజీ పథకంలో భాగంగా వీజీ పీపీ ప్రణాళిక తయారీపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నోడల్ అధికారి, డీపీఓ డి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామాల్లో వేజ్ పేమెంట్, మెటీరియల్ పేమెంట్‌కు సంబంధించిన పనులను ముందుగానే గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని అధికారులు సూచించారు. గుర్తించిన పనులను తప్పనిసరిగా గ్రామసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని తెలిపారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతుల కల్పన, గ్రామీణ జీవనోపాధి మౌలిక సౌకర్యాలు, వరద నివారణ చర్యలు వివరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕