నిజామాబాద్‌లోని స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తులసి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి రోజున తులసి కోటను అరటి గడలు, మామిడి తోరణాలు, పువ్వులతో అందంగా అలంకరించి, కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఆలయ అర్చకులు రాజుకిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తరించారు. ఆలయ అధికారులు దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.