నిజామాబాద్ సెషన్స్ జడ్జి భారత లక్ష్మి సోమవారం, ఇద్దరు దొంగలకు మూడు కేసుల్లో రెండేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి కథనం ప్రకారం, భోధన్ పట్టణానికి చెందిన మాలోత్ రమేష్, కటకం రవి అనే ఇద్దరు నిందితులు 2005 మే 18న నిజామాబాద్ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు బైక్ దొంగతనాలు చేశారు. ఈ కేసుల్లో విచారణ పూర్తి చేసిన పోలీసులు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కోర్టులో నేరం రుజువు చేయడంతో, న్యాయమూర్తి భారత లక్ష్మి నిందితులకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.