రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. వ్యక్తి మృతి

నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు గ్రామ శివారులో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడుపల సాగర్ (30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో శివ (28) అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే స్పందించి, గాయపడిన శివను నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎస్సై శ్యామ్‌రాజు కేసు నమోదు చేసి, మృతుడు సాగర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఢీకొట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్