సితాయిపేట్ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

ధర్పల్లి మండలంలోని సితాయిపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సిహెచ్. భూమేష్ విద్యార్థులకు యూనిఫాం దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి, మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, పరిశుభ్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రకాంత్, పాఠశాల చైర్మన్ మౌనిక, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕