నగరంలోని వినాయక్ నగర్ లో మంగళవారం జరిగిన హిందూ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, హిందువుల్లో ఐక్యత పెరగాలని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. హిందువుల్లో ఉన్న చిన్న చిన్న భేద తారతమ్యాలను దూరం చేయాలని, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాలకు అపూర్వ స్పందన వస్తుందని, సంఘ్ నుంచి వక్తలు చెప్పే మాటలను తూచా తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.