స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

జనగణన 2027లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఆదివారం నగరంలోని తన నివాసంలో స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగణన పోర్టల్ ద్వారా అధికారులు స్వీయ నమోదు వివరాలు, ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొని స్వీయ నమోదు చేసుకోవాలని, ఎటువంటి అపోహలకు గురికాకుండా ప్రభుత్వ అధికారిక పోర్టల్ లో తమ వివరాలను పొందుపరచాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించడంతో పాటు, ప్రజలు స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్