కలెక్టరేట్ లో ఘనంగా వడ్డె ఓబన్న జయంతి వేడుకలు*

స్వాతంత్ర్య పోరాటంలో వడ్డె ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలను వక్తలు ప్రశంసించారు. ఆదివారం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వడ్డె ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సంఘాల ప్రతినిధులు వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమని వక్తలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్