జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వాసు

ఇందూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చాలో కీలక నియామకం జరిగింది. జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా అన్సన్ పల్లి గ్రామానికి చెందిన తన్నీరు శ్రీనివాస్ నియమితులయ్యారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, సేవా భావాన్ని గుర్తిస్తూ అధిష్ఠానం ఈ బాధ్యతలను అప్పగించింది. శ్రీనివాస్ నియామకం పట్ల ఇందల్వాయి మండల బీజేపీ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మండల పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు ఆయనకు హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన పదవిని స్వీకరించిన తన్నీరు శ్రీనివాస్ జిల్లాలో ఓబీసీ మోర్చా బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕