రేపు నిజామాబాద్ లో ఊర పండగ

నిజామాబాద్ నగరంలో రేపు జరుగనున్న ఊర పండుగకు సర్వం సిద్ధమైంది. ఊర పండుగ రోజున నగరంలోని 12 చోట్ల కొలువై ఉన్న 14 గ్రామ దేవతల గుడుల్లో అన్ని కులాల్లోని అన్ని కుటుంబాలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయనున్నారు. మామిడి కర్రతో కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. నగరంలోని నకాస్ గల్లీలో ఈ విగ్రహాలను తయారు చేస్తున్నారు. కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించాక పాత విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేస్తారు.

సంబంధిత పోస్ట్