ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు తప్పనిసరిగా నింపాలి.. ఎంపీ అరవింద్

నిజామాబాద్ అర్బన్ కార్యాలయంలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR కార్యక్రమంలో భాగంగా  ఎంపీఅరవింద్ ధర్మపురి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు శుక్రవారం అందించారు. నిజామాబాద్ పార్లమెంటు ఓటర్లు అందరూ BLO లనుండి ఫారం తీసుకొని, జాగ్రత్తగా నింపి, తిరిగి అందజేయాలని సూచించారు. ఓటు హక్కును కాపాడుకోవడానికి ఆధార్, ఓటర్ ఐడీ, 2002 ఓటరు ఐడీ, పాస్ పోర్టు సైజు ఫోటోతో BLO లకు సహకరించాలని కోరారు. ఒక్క డూప్లికేట్ ఓటు, నకిలీ ఓటు కూడా కొత్త జాబితాలో ఉండకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, పారదర్శకంగా ప్రక్రియ జరగాలని ఎంపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్