ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం

ధర్పల్లి మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ డాక్టర్ పి. రవిరాజ్ మాట్లాడుతూ 2011 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రకృతిని, సహజ వనరులను పరిరక్షించుకోవడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని, పర్యావరణ పరిరక్షణే మన సంపూర్ణ రక్షణ అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕