కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 12. 411 టీఎంసీలుగా నమోదైంది. సోమవారం ఉదయం 6 గంటల 24 గంటల సగటు వివరాల ప్రకారం ప్రాజెక్టు నీటిమట్టం 1400. 95 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం (FRL) 1405 అడుగులు కాగా, పూర్తి సామర్థ్యం 17. 802 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 24 గంటల సగటు ఇన్ఫ్లో శూన్యంగా ఉంది. మరోవైపు వివిధ మార్గాల ద్వారా మొత్తం 1196 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.