రెడ్డిపేట తండా అటవీప్రాంతంలో ఆవుపై దాడి చేసిన పెద్దపులి

ఎల్లారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తండా అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా తండా శివారులో పులి సంచరిస్తున్నట్టుగా ప్రజలు చెప్తున్నారు. రెండు రోజుల క్రితం ఓ ఆవుపై పులి దాడి చేసి చంపింది. తాజాగా ఆదివారం మరోసారి ఓ ఆవుపై దాడికి యత్నించగా ఆవు తృటిలో తప్పించుకోగా ఆవు గొంతుపై తీవ్ర గాయమైంది. దాంతో స్కూల్ తండా, భట్టు తండా, జగదాంబ తండా ప్రజలు భయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్