మధ్యాహ్నం నుంచి ఎల్లారెడ్డిలో మళ్ళీ దంచికొడుతున్న వాన

ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మళ్ళి దంచికొడుతోంది. రాత్రి నుంచి ఇప్పటివరకు పలుమార్లు వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పట్టణంలోని చిన్నపాటి రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. వరుసగా కురుస్తున్న వర్షంతో వాతావరణం చల్లబడగా, ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.

సంబంధిత పోస్ట్

✕
✕