నాగిరెడ్డిపేట్MPDO గంగాధర్ ను సన్మానించిన జలాల్ పూర్ సర్పంచ్

నాగిరెడ్డిపేట్ మండలం నూతన MPDOగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గంగాధర్ ను జలాల్ పూర్ గ్రామ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడు జమ్మికుంట జీవరత్నం లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలు అందజేయాలని కోరారు. MPDO గంగాధర్ మాట్లాడుతూ, ఎల్లప్పుడూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామ మండల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ మండల ప్రజలకు మెరుగైన ఉత్తమ సేవలు అందజేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్