కామారెడ్డి జిల్లాలో, తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ), NUJ(I) కామారెడ్డి జిల్లా కమిటీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్, ఇంచార్జీ డిపి ఆర్ఓ గిరికి వినతిపత్రం సమర్పించింది. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత, ఆరోగ్య–సంక్షేమ పథకాలు, పిల్లల విద్యకు సహాయం అందించాలని, ప్రతి రెండు నెలలకు అక్రిడేషన్ కమిటీ సమావేశం నిర్వహించాలని జిల్లా అధ్యక్షుడు సడక్ సునీల్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో NUJ(I) జాతీయ ఉపాధ్యక్షుడు వి. రాజేందరనాథ్, టీ జే ఏ సభ్యులు పాల్గొన్నారు.