ఎల్లారెడ్డి మండలం వడ్డెర కాలనీకి చెందిన గండికోట మల్లేష్ (35) అనారోగ్యంతో బాధపడుతూ, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది, ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్.ఐ. మహేష్ తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.