కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ పరిధిలోని బోర్లం క్యాంప్ తాండకు చెందిన ఒక వ్యక్తి మంగళవారం వడదెబ్బతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.