పాల్వంచ మండలం పోతారం గ్రామంలో ఆదివారం రాత్రి ఇటుకల లోడ్ ఖాళీ చేసి తిరిగి వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒడిశాకు చెందిన రాయ్ సింగ్ (30) అనే కూలీ ఎముకలు విరిగి మృతి చెందగా, పాల్వంచకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నర్సింలు, ఒడిశాకు చెందిన కూలీ దేవకుమార్లకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.