కామారెడ్డి జిల్లాలో చిరుతపులుల సంచారం భయాందోళనలో జనం

కామారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. పిట్లం, అన్నసాగర్, ఎల్లారెడ్డి-లింగంపేట్, ఎల్లారెడ్డి-కొత్త హన్మాండ్లు ప్రాంతాల్లో గత వారం రోజులుగా చిరుతలు గ్రామ పొలిమేరల్లో, రోడ్ల పక్కన కనిపిస్తున్నాయి. అన్నసాగర్ వద్ద ఓ రైతుకు చెందిన మేకలను చిరుత చంపేసింది. ఎల్లారెడ్డి అటవీ శాఖ పరిధిలో రెండు చిరుతలు, పిట్లం రహదారిలో ఒక పులి కనిపించడంతో జిల్లాలో ఎన్ని చిరుతలు ఉన్నాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొందరు దూరం నుంచి వాటిని మొబైల్స్‌లో బంధిస్తున్నారు.

సంబంధిత పోస్ట్