ఎల్లారెడ్డిలో అర్ధరాత్రి మొదలైన వర్షం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో అర్ధరాత్రి 12:30 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. గత వారం రోజులుగా వర్షం జాడ లేక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు సంభవిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕