నాగిరెడ్డిపేట్ మండల కేంద్రం సమీపంలోని లొంకలపల్లి గ్రామ రోడ్డులో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన మున్నూరి మహేందర్ (30) మృతి చెందాడు. నాగిరెడ్డిపేట్ గ్రామానికి చెందిన నీరుడి పోశయ్య తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. స్థానికులు, ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మహేందర్ మృతి చెందాడు.