ఘనంగా వైశ్య భవన్ వినాయక మండలి శోభాయాత్ర

ఎల్లారెడ్డి పట్టణంలోని వాసవీమాత ఆలయంలో ప్రతిష్ఠించిన వైశ్య భవన్ వినాయక మండలి గణనాథుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. వైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ధి శ్రీధర్ నాయకత్వంలో శోభాయాత్ర వైభవంగా సాగింది. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాటాలు, నృత్యాలు, భజనలతో సందడి చేశారు. భక్తిశ్రద్ధలతో సాగిన శోభాయాత్ర ఎల్లారెడ్డి చెరువు వరకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణనాథుడిని చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్

✕
✕