కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్చిపూర్ శివారు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడియాల రమణమ్మ(55) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. విజయనగరం నుంచి బాసరకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఆపి రోడ్డు పక్కన నిలబడిన ఆమెను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ. రంజిత్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. వెల్లడించారు.

సంబంధిత పోస్ట్