రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గారావు ఫారం సమీపంలో బుధవారం బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో సురేష్ గంగాధర్ శీలంవార్ (21) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన సురేష్, మంగళవారం తన బావ ఇంటికి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్