జాతీయరహదారులపై టోల్‌ప్లాజాల వద్ద ఏప్రిల్ 10వ తేదీ నుంచి నగదు చెల్లింపులను నిలిపివేయనున్నారు. కేవలం ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు చేయాలి. ఒకవేళ వాహనాలకు ఫాస్టాగ్‌ను అతికించకపోతే UPI విధానం ద్వారా టోల్ రుసుమును చెల్లించే అవకాశం ఉంది. కానీ వాస్తవిక రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా టోల్ ఛార్జీని చెల్లించాల్సిందే. వాహనదారులు ఇది గమనించాలి.