యూపీఐ ప్లాట్‌ఫాం లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించబోమని RBI స్పష్టం చేసింది. UPI వినియోగదారుల కోసం ఉచితంగా కొనసాగుతుందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. డిజిటల్ చెల్లింపులపై అదనపు ఫీజులపై వచ్చిన అనుమానాలను తిప్పికొట్టిన ఆయన.. ప్రభుత్వం, RBI కలిసి యూపీఐని ‘జీరో కాస్ట్’ ప్లాట్‌ఫారంగా కొనసాగించాలన్న దృఢమైన నినాదంతో ఉందని తెలిపారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ ల ద్వరా చేసే చెల్లింపులపై త్వరలో RBI ఛార్జీలు వసూలు చేయనుందని ప్రచారం జరుగుతోంది.