యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని భారత జట్టులోకి తీసుకోవాలని వస్తున్న డిమాండ్లపై టీం ఇండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించారు. 15 ఏళ్ల వైభవ్‌పై అధిక హైప్ సృష్టించడం అతని క్రికెట్ ఎదుగుదలకు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సంజు శాంసన్, అభిషేక్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నారని, జట్టులో కేవలం 11 మందికే అవకాశం ఉంటుందని కోటక్ వివరించారు. ఇప్పటివరకు తనకు ఆడే అవకాశం రాలేదని వైభవ్ ఎటువంటి ఫిర్యాదు చేయలేదని కూడా ఆయన పేర్కొన్నారు.