TG: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములను నమ్ముకున్నందుకు మాకు ఈ శిక్ష పడిందని బాధితుల కన్నీటి గోస పడుతున్నారు. ఇల్లు లేకపోవడంతో రోడ్డుపై పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'బువ్వ లేదు, నిద్ర లేదు, ఇల్లు లేదు. మా సామాన్లతో పాటు మా బతుకు కూడా రోడ్డు మీద పడింది' అంటూ కూల్చివేతల్లో ఇల్లు పొగుట్టుకున్న బాధితురాలి ఆవేదన చెందుతూ కన్నీళ్లు పెట్టుకుంది. మీకు న్యాయం చేస్తామని ఏ ఒక్కరు కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.