అమెరికా కార్మిక శాఖ 8 IT సంస్థలకు PERM దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేయడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. PERM, H-1B వీసా కార్యక్రమాలు వేర్వేరని, ఇప్పటికే H-1B వీసా ఉన్నవారికి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. అయితే, గ్రీన్ కార్డు ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. USలోని భారతీయ నిపుణులు నైపుణ్యం కలవారని, ఆ దేశం తరతరాల వలసదారుల శ్రమతోనే అభివృద్ధి చెందిందని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.