బోయింగ్‌ ఇంధన స్విచ్చుల్లో ఎలాంటి సమస్యల్లేవ్‌: ఎయిరిండియా

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం తర్వాత బోయింగ్‌ విమానాల్లో భద్రతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బోయింగ్‌ విమానాల ఫ్యూయ‌ల్ కంట్రోల్ స్విచ్‌లను ఈ నెల 21 లోగా తనిఖీ చేయాలని డీజీసీఏ అన్ని సంస్థలకు ఆదేశించింది. ఈమేరకు తనిఖీలు చేపట్టిన ఎయిరిండియా, తాము నడుపుతున్న బోయింగ్‌ విమానాల ఇంధన స్విచ్ఛులలో ఎలాంటి సమస్యలు లేవని వెల్లడించింది. మెయింటనెన్స్‌లో భాగంగా కంట్రోల్‌ మాడ్యూల్‌లను మార్చినట్టు పేర్కొంది.

సంబంధిత పోస్ట్