బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో ఎవరూ చేరలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పారన్నారు. తాము బీఆర్ఎస్ నుంచి ఎవరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని నిన్న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి వ్యాఖ్యలు చర్చనీయంశంగా మారాయి.