TG: సీఎం రేవంత్ రెడ్డిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డిని ఎవరూ దేకడం లేదని, ఆ పేరును గుర్తు పెట్టుకోవట్లేదని విమర్శించారు. ‘ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. నిన్న ఓ ఫంక్షన్‌లో యాంకర్ ఆయన పేరు మర్చిపోయి, శ్రీధర్ బాబు పేరు చెప్పారు. రెండున్నరేళ్లయింది ఆయనను యాంకర్లు, యాక్టర్లు ఎవరూ గుర్తు పెట్టుకోవడం లేదు. ప్రజలు రేవంత్ పేరు తీస్తేనే బూతులు తిడుతున్నారు’ అని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.