TG: తీన్మార్ మల్లన్న గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. MLC మల్లన్నపై జాగృతి కార్యకర్తలు, ఎమ్మెల్సీ కవిత అనుచరులు దాడి చేశారని, ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో ఆఫీస్ అద్దాలు పగిలి, గాజు పెంకులు గుచ్చుకోవడంతో కొందరికి గాయాలయ్యాయని చెప్పారు. ఈ దాడిలో మల్లన్న చేతికి గాయమైందని, వారిని అదుపు చేసేందుకు గన్‌మెన్ 5 రౌండ్ల కాల్పులు జరిపారన్నారు.