వాట్సాప్‌లో 'నో' రిప్లై.. చార్టర్డ్ అకౌంటెంట్ ఖాతా ఖాళీ!

యూపీ రాజధాని లక్నోలో వాట్సప్‌లో వచ్చిన ఒక అనధికారిక డెబిట్ అలర్ట్ మెసేజ్‌కు 'నో' అని రిప్లై ఇవ్వడంతో ఓ చార్టర్డ్ అకౌంటెంట్ తన రెండు బ్యాంక్ ఖాతాల నుంచి రూ.1.70 లక్షలు పోగొట్టుకున్నారు. ఎలాంటి ఓటీపీ, లింక్ లేకుండా జరిగిన ఈ కొత్త రకం సైబర్ మోసం కలకలం రేపుతోంది. సైబర్ నేరగాళ్ల కొత్త పద్ధతులపై పోలీసులు ఫోరెన్సిక్ దర్యాప్తు జరుపుతున్నారు. అనధికారిక మెసేజ్‌లకు స్పందించవద్దని, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి నేరుగా అధికారిక బ్యాంక్ యాప్ లేదా వెబ్‌సైట్ మాత్రమే ఉపయోగించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕