వర్షాకాలంలో ఎక్కువ మంది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బయట దొరకే చాట్, పానీపూరీ, కట్‌లెట్, పావ్‌బాజీ వంటి పదార్థాలు తినడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ, వీటి తయారీలో కలుషితమైన నీరు ఉపయోగిస్తే విరేచనాలు, పచ్చకామెర్లు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, వీలైతే ఇంట్లోనే చేసుకుని తినడానికి ప్రయత్నించండి. అలాగే పండ్ల రసాలు కూడా ఇంట్లోనే చేసుకుంటే మంచిది.