రూ.200 కోట్ల మోసం కేసులో సాక్షిగా ఉన్న బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. తాను కెనడా పౌరురాలినని, వర్క్ వీసాపై భారత్లో ఉంటున్నట్లు తెలిపారు. 2020లో సుకేశ్ చంద్రశేఖర్ భార్య లీలా పాలోస్ ఓ కార్యక్రమానికి తనను ఆహ్వానించారని, ఆ సమయంలో సుకేశ్ ఫోన్లో మాట్లాడి కారును బహుమతిగా ఇస్తానన్నారని కోర్టుకు వివరించారు. ఈ కేసులో గతంలో రెండుసార్లు సమన్లు జారీ చేసినా హాజరుకాకపోవడంతో కోర్టు మందలించింది. తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది.