దేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.