ఏడాది నుంచి ఒక్క రూపాయి కూడా రైతు బంధుకు ఇవ్వలేదు: కేటీఆర్ (వీడియో)

TG: కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని బొందపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది నుంచి ఒక్క రూపాయి కూడా రైతుబంధుకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. రైతు శాసించాలని కేసీఆర్ అంటే.. రైతులు యాచించాలని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్