ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు AS రవికుమార్ చౌదరి గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం రాత్రి తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. గోపీచంద్ హీరోగా ‘యజ్ఞం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమ్యారు. ఆ తర్వాత వీరభద్ర, పిల్లా నువ్వులేని జీవితం, ఆటాడిస్తా, తిరగబడరా స్వామి వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.