తన 44 ఏళ్ల కెరీర్‌లో నేర్చుకున్న ముఖ్యమైన విషయం ‘ఏదీ శాశ్వతం కాదు’ అని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. కఠిన సమయాలు, ఒత్తిళ్లు, ఎదురుదెబ్బలు తాత్కాలికమై తొలగిపోతాయని అన్నారు. సమస్యల మధ్యలో శాశ్వతంగా అనిపించినా.. చివరికి పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ జీవన సందేశం యువతకు ప్రేరణగా నిలుస్తోంది.